Breaking News

హష్‌ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట

Published on Sun, 11/24/2024 - 05:21

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్‌ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్‌ కోర్టు ఆయనకు నవంబర్‌ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. 

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్‌ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు.

 శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్‌ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్‌ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్‌కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్‌ లెక్కల్లో చూపలేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)