Breaking News

వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు

Published on Sat, 03/29/2025 - 05:05

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంజాన్‌ సందర్బంగా గురువారం వైట్‌ హౌస్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ముస్లిం సోదరులకు రంజాన్‌ ముబారక్‌ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్‌ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. గత బైడెన్‌ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్, ఏడు అరబ్‌ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో గతంలో ట్రంప్‌ ప్రభుత్వం హయాంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారడం, గాజాపై మళ్లీ ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ట్రంప్‌ ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం గమనార్హం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)