Breaking News

విద్యార్థి వీసా నాలుగేళ్లే!

Published on Fri, 08/29/2025 - 05:47

వాషింగ్టన్‌: అమెరికాలో వీసాల గడువును పరిమితం చేయడానికి ట్రంప్‌ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దుర్వినియోగాన్ని తగ్గించడానికి, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడానికంటూ బుధవారం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్‌–వీసాలు, కల్చరల్‌ ఎక్ఛ్సేంజ్‌ కోసం ఇచ్చే జే–వీసాలు, విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే ఐ–వీసాలపై కాలపరిమితి విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థి వీసాలపై ఎలాంటి కాలపరిమితి లేదు. 

వాళ్లు చదివే కోర్సు ఎన్ని సంవత్సరాలున్నా అంతకాలం వారు ఆ దేశంలో ఉండే అవకాశం ఉంది. అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థి, ఎక్ఛ్సేంజ్‌ వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఆ గడువు ముగిశాక పొడిగింపు కోసం దర ఖాస్తు చేసుకోవాలి. ఇక జర్నలిస్టులకు 240 రోజు లు మాత్రమే అనుమతిస్తారు. ఇక చైనీయులకైతే  కేవలం 90 రోజుల వీసాకు మాత్రమే అనుమతిస్తారు.  

గత ఏడాది 16 లక్షల మంది విదేశీ విద్యార్థులు 
2024లో ఎఫ్‌–వీసాలపై దాదాపు 16 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా వచ్చారు. అలాగే, దాదాపు 3,55,000 మంది కల్చరల్‌ ఎక్ఛ్సేంజ్‌ సందర్శకులు, 13వేల మంది జర్నలిస్టులు అమెరికాకు వచ్చారు. ‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి చాలాకాలంగా అనుమతి ఉంది. దీనివల్ల భద్రతా ప్రమాదాలు తలెత్తుతున్నాయి. 

పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథాగా ఖర్చవుతోంది. అమెరికా పౌరులకు ఇది నష్టాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనలు వీసా హోల్డర్లు అమెరికాలో ఉండే సమయాన్ని పరిమితం చేస్తాయి. దుర్వినియోగం ఆగిపోతుంది. విదేశీ విద్యార్థులను పర్యవేక్షించడానికి ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’ అని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు ఉంటుంది.  

అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత 
డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి పదవీకాలం 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4,300కి పైగా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ విద్యావేత్తల సమూహమైన ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే.. బైడెన్‌ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. 

ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై అణచివేత తీవ్రం చేసిన విషయం తెలిసిందే. ఆ చర్యల్లో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థి వీసాలు, గ్రీన్‌ కార్డులు రద్దయ్యాయి. లక్షలాది మంది వలసదారుల చట్టపరమైన హోదా కోల్పోయారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)