Breaking News

ఇక ఉక్రెయిన్‌–రష్యాపైనే దృష్టి: ట్రంప్‌ 

Published on Fri, 10/17/2025 - 04:59

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్‌కు లాంగ్‌–రేంజ్‌ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు.

 రష్యా దాడులను తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్‌ సైన్యం ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ట్రంప్‌ బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత పుతిన్‌కు సూచించారు. లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చిచెప్పారు. 

మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)