Breaking News

కాల్పులపై తొలిసారి స్పందించిన ట్రంప్‌

Published on Sun, 07/14/2024 - 19:01

న్యూయార్క్‌: ఎన్నికల ర్యాలీలో తన మీద జరిగిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా స్పందించారు. ‘ఊహించనిది జరగకుండా ఆ దేవుడు మాత్రమే కాపాడాడు. అమెరికన్లందరూ ఒక్కటి కావాలి. ధృడనిశ్చయంతో నిలబడాలి. చెడు విజయం సాధించకుండా అడ్డుపడాలి’అని పిలునిచ్చారు. 

ఈ మేరకు ఆదివారం(జులై 14) ఉదయం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌సోషల్‌లో ట్రంప్‌ ఒక పోస్టు పెట్టారు. కాగా, శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. 

ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి బుల్లెట్‌ గాయమై రక్తం చిందింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కాల్పలు జరిపిన దుండగుడిని మట్టుబెట్టి ట్రంప్‌ను అక్కడి నుంచి తరలించారు. ఘటన తర్వాత ట్రంప్‌ తన ప్రైవేట్‌ విమానం ట్రంప్‌ ఫోర్స్‌లో నుంచి దిగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌,రిపబ్లికన్ల తరపున ట్రంప్‌ హోరాహోరీ తలపడుతున్నారు. 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు