Breaking News

యుద్ధం ఆపా!

Published on Thu, 12/11/2025 - 06:10

న్యూయార్క్, పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అదే పాట పాడారు. ‘భారత్, పాక్‌ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి.  కల్పించుకుని దాన్ని నివారించా‘ అన్నారు. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! మంగళవారం పెన్సిల్వేనియాలోని మౌంట్‌ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. 

కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్‌ బైజాన్‌‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్‌ లాండ్‌ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్‌ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్‌ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్‌ స్టాప్‌ పెట్టానని చెప్పుకొచ్చారు. 

నార్వే, స్వీడన్, డెన్మార్క్‌ లాంటి దేశాల నుంచి అమెరికాకు రారెందుకంటూ వాపోయారు. గత ఏప్రిల్‌ లో జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతో పొట్టన పెట్టు కోవడం, అందుకు ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి దాయాది పీచమణచడం తెలిసిందే. చివరికి పాక్‌ కాళ్ల బేరానికి రావడంతో శాంతి కుదిరింది. అదంతా తన ఘనతేనని అప్పట్లోనే ట్రంప్‌ చెప్పు కున్నారు. అదేమీ లేదని భారత్‌ అప్పుడే కొట్టిపారేసింది. కేవలం ఇరు దేశాల చర్చలతోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేసింది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)