Breaking News

Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్‌’ గాయని ఘనత ఇదే

Published on Tue, 01/21/2025 - 07:17

అమెరికా 47వ అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో గాయని, పాటల రచయిత్రి క్యారీ అండర్వుడ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ ను ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో క్యారీ అండర్వుడ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

క్యారీ అండర్‌వుడ్.. అమెరికన్ గాయని, నటి, రచయిత. ఆమె 1983 మార్చి 10న  ఒక్లహోమాలోని పిల్ల్స్‌బోరోలో జన్మించారు. ఆమె సంగీత ప్రస్థానం 2005లో ‘అమెరికన్ ఐడల్’ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన అనంతరం ప్రారంభమైంది. క్యారీ అండర్‌వుడ్ అద్భుతమైన గాయనిగా పేరొందారు. దీనికి తోడు ఆమె పలువురి అభినందనలను అందుకున్నారు. సంగీతం పరంగా ఆమె పలు రికార్డులను సృష్టించారు.

క్యారీ  ఇప్పటివరకూ ఏడు ఆల్బమ్స్ విడుదల చేశారు. అందులో మొదటిది ‘Some Hearts’. ఇది 2005లో విడుదలకాగా, ఎనిమిది మిలియన్లకు మించిన కాపీలు విక్రయమయ్యాయి. ఆమె మొదటి నాలుగు సింగిల్స్  హిట్‌ కావడంతో ఆమె మరింత గుర్తింపును పొందారు. క్యారీ అండర్‌వుడ్.. తన కంట్రీ మ్యూజిక్‌లో అత్యంత ప్రభావవంతమైన రెండవ వ్యక్తిగా నిలిచారు.

అమెరికా పాటగా గుర్తింపుగా నిలిచిన ‘అమెరికా ది బ్యూటిఫుల్‌’కు ఆమె ప్రదర్శన తోడవడంతో ఆ పాటకు మరింత ప్రధాన్యత ఏర్పడిందంటారు. ఈ పాటు దేశభక్తి, నేషనలిజం, సమానత్వం తదితర అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదర్శన 2021లో జరిగిన బైడెన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలోనూ ప్రదర్శితమయ్యింది. క్యారీ అండర్‌వుడ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లో నిలిచింది. ఆమె మైక్ ఫిషర్ అనే హాకీ క్రీడాకారుడిని 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమెరికా ది బ్యూటిఫుల్‌ ప్రదర్శనలో క్యారీ అండర్‌వుడ్  ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అండర్‌వుడ్ పలువురు యువ కళాకారులకు, అభిమానులకు  స్ఫూర్తినిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)