Breaking News

నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్‌ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?

Published on Fri, 06/27/2025 - 17:36

మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు.  ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.

కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. 

ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్‌నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్‌ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్‌లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే  ఆ ట్రైన్‌ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. 

భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్‌లో..
ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది.  ఇటీవల సియోల్‌కు చెందిన వాన్‌ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు.  సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్‌ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు.  అలా అనుకుంటూనే ట్రైన్‌ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్‌ డబ్బా బ్యాగ్‌తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్‌ కోచ్‌లో జనం కాస్త సంతోషంగా కనిపించారు.  

తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్‌ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్‌ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు.  పెట్రోల్‌ మొత్తం కోచ్‌ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి.  సముద్రగర్భంలోని టన్నెల్‌లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  నిందితుడు వాన్‌ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో  చేర్చి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటన కారణంగా  240,000 యూఎస్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

వాన్‌పై హత్యాభియోగాలు
ఈ దారుణానికి పాల్పడ్డ వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  కదులుతున్న ట్రైన్‌లో ఘటన జూన్‌ 9న జరగ్గా,  ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్‌పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్‌.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు.  ట్రైన్‌లో పెట్రోల్‌ పోసిన ఘటన వీడియో వైరల్‌గా మారింది.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)