Breaking News

‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!

Published on Tue, 10/03/2023 - 09:34

మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 

2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్‌లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
ఇది కూడా చదవండి: అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)