Breaking News

పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత

Published on Mon, 12/02/2024 - 06:28

పెషావర్‌: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్‌ ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో కనీసం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్‌ తెగల మధ్య నవంబర్‌ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్‌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిపి 57 మంది చంపేయడంపై ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

 ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. దీంతో, ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులను ఆపేసింది. పెషావర్‌–పరాచినార్‌ రహదారిని, పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్‌ వద్ద రాకపోకలను నిలిపివేసింది. దీంతో, చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఖైబర్‌ ప్రభుత్వ యంత్రాంగం అంటోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)