Breaking News

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదాలు.. 24 మంది మృతి

Published on Sun, 01/18/2026 - 05:37

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటన లాహోర్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధా జిల్లాలోని కోట్ మోమిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన ట్రక్కులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు తెలిపారు. వీరంతా ఫైసలాబాద్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారి మూసివేయడంతో డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తక్కువ దృశ్యమానత కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి గాలాపూర్ వంతెన నుంచి నీరు లేని కాలువలోకి ట్రక్కు పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోట్ మోమిన్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బలూచిస్థాన్‌లో బస్సు బోల్తా: 10 మంది మృతి
ఇదే రోజు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ సమీపంలోని మక్రాన్ తీరప్రాంత రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పాకిస్తాన్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)