Breaking News

ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులపై సైబర్‌ ఎటాక్‌!

Published on Sat, 09/20/2025 - 14:43

ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాలపై సైబర్‌ దాడులు జరిగాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం.. లండన్‌ హీత్రో, బ్రస్సెల్స్‌(బెల్జియం)తో పాటు యూరప్‌ దేశాల్లోనే విమానాశ్రయాలను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 

కోలిన్స్‌ ఎయిరోస్పేస్‌(Collins Aerospace) అనే సంస్థ నిర్వహించే చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. హీత్రో విమానాశ్రయంలో విమాన ప్రయాణాలు ఆలస్యం కాగా, బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ సేవలు నిలిచిపోవడంతో మాన్యువల్‌గా చెక్‌ ఇన్‌ నిర్వహిస్తున్నారు. సైబర్‌ దాడి జరిగిన విషయాన్ని బెర్లిన్(జర్మనీ) విమానాశ్రయం కూడా తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. అయితే, ఫ్రాంక్‌ఫర్ట్, జ్యూరిచ్ విమానాశ్రయాలు ఈ దాడి నుంచి తప్పించుకున్నాయి.

సైబర్‌ దాడి ప్రభావంతో యూరప్‌ దేశాల విమానాశ్రాయాల్లో అలజడి నెలకొంది. ఈ ప్రభావంతో వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను రద్దు చేశారు. 

అమెరికా అధ్యక్షుడు హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు రుసుమును అమెరికా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు ఫుల్‌ బిజీగా మారాయి. ఈ క్రమంలోనే ఈ సైబర్‌ దాడి జరగడం గమనార్హం.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)