Breaking News

బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం

Published on Thu, 07/04/2024 - 13:47

జపాన్‌ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్‌ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి  ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.

‘యూజెనిక్స్ ప్రొటెక్షన్‌ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్‌ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ  కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు  ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)