అందం కూడా నేరమా?.. మేకప్‌ వేస్తే జైలే!!

Published on Thu, 06/11/2026 - 10:26

ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ముందు.. ఏం దుస్తులు వేసుకోవాలి? అనే ఆత్రుత సహజమే!.  కళ్లకు అద్దుకునే కాటుక దగ్గరి నుంచి కాలికి వేసుకుని చెప్పుదాకా.. అన్నీ పక్కాగా ఉండాలని మహిళల్లో కొందరు అనుకుంటారు. కానీ, వాళ్లు ఏం వేసుకోవాలి? ఎలా ఉండాలి?.. ఇలా అన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఊహించగలరా?.. ఇప్పుడు ఆ దేశంలో అదే జరుగుతోంది. కాదంటే.. బలవంతంగా బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నారు..

మహిళలపై ఇప్పటికే ఎన్నో పరిమితులు అమలు చేస్తున్న అఫ్గనిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం తాజాగా మరోసారి కఠిన చర్యలకు దిగింది. ముఖం పూర్తిగా కప్పుకోకుండా బయటకు రావడంపై నిషేధం విధించింది. అలాగే.. బిగుతైన దుస్తులు ధరించడం, మేకప్‌ వేసుకోవడం నేరమని ప్రకటించింది. తాము నిర్దేశించిన రీతిలో హిజాబ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో.. పలువురిని అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించే అధికారం పోలీసులకు సైతం కల్పించారు.

మహిళలు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులపైనా బాధ్యత మోపారు. ఇంట్లోని మహిళలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆ ఇంట్లోని మగవాళ్లదేనని స్పష్టం చేసింది తాలిబాన్‌ ప్రభుత్వం. ఉల్లంఘనలు కొనసాగితే పురుషుల మీద కూడా కేసులు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌లో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇక.. కొత్త నిబంధనల అమలులో భాగంగా హెరాత్‌లోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రహదారులపై వెళ్తున్న వాహనాలు, ట్యాక్సీలను ఆపి మహిళల దుస్తులు, హిజాబ్‌ విధానాన్ని తనిఖీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం 21 మంది మహిళలు, బాలికలను ఈ నిబంధనల ఉల్లంఘన పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

అరెస్టైన వారిలో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు కూడా ఉన్నట్లు సమాచారం. భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో గడ్డం నిబంధనలు పాటించలేదనే కారణంతో కొందరు వైద్యులు, నర్సులను కూడా తాలిబాన్‌ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్‌ ప్రభుత్వం మహిళలపై వరుస ఆంక్షలు విధిస్తోంది. బాలికల ఉన్నత విద్యపై నిషేధం, ఉద్యోగ అవకాశాల పరిమితి, ప్రజా ప్రదేశాల్లో సంచారంపై ఆంక్షలు వంటి వందకు పైగా ఆదేశాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా వచ్చిన ఈ నిర్ణయాలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను మరింత కుదించే చర్యలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)