Breaking News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం! గ్రామ్ కోట్లలో

Published on Wed, 02/11/2026 - 23:37

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయితే ప్రపంచంలో బంగారం కంటే కొన్ని లక్షల రెట్లు ఖరీదైన లోహం ఒకటి ఉందని మీకు తెలుసా? ఒకే ఒక్క గ్రాముతో వందల కిలోల బంగారం కొనొచ్చు అంటే నమ్మగలరా? బంగారం కంటే లక్షల రెట్లు ఖరీదైన ఒక లోహం ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరు కాలిఫోర్నియం. దీని ధర వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక గ్రాము కాలిఫోర్నియం ధర సుమారు 27 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.239 కోట్లు. అంటే ఒక్క గ్రాము కొనాలంటే దాదాపు 200 కిలోల బంగారం విలువ అనమాట.

కాలిఫోర్నియం భూమిలో సహజంగా దొరికే లోహం కాదు. ఇది పూర్తిగా ప్రయోగశాలలో సృష్టించిన సింథటిక్ మూలకం. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారి తయారు చేశారు. అందుకే ఆ రాష్ట్రం పేరుతో దీనికి కాలిఫోర్నియం అనే పేరు పెట్టారు. దీనిని తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అణు రియాక్టర్లలో ఇతర మూలకాలను దీర్ఘకాలం న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు, కొన్ని ప్రత్యేక ల్యాబ్‌లు మాత్రమే దీనిని తయారు చేయగలవు. పైగా ఇది అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకం కావడంతో దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా చాలా ఖరీదైన, ప్రమాదకరమైన ప్రక్రియ.

ఇంత ఖరీదైన మూలకం అయినప్పటికీ దీన్ని ఆభరణాల కోసం ఉపయోగించరు. కానీ దీని ప్రయోజనాలు మాత్రం అసాధారణం. కాలిఫోర్నియం-252ను క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఇతర చికిత్సలు పనిచేయని సందర్భాల్లో ఇది కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అణు పరిశ్రమలో రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది స్టార్టర్‌గా పనిచేస్తుంది. అంతరిక్ష పరిశోధనలో పరికరాల పరీక్షల్లో దీని ఉపయోగం ఉంది. అలాగే గనుల్లో బంగారం, వెండి నిల్వలను గుర్తించడంలో, చమురు బావుల అన్వేషణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

అంటే కాలిఫోర్నియం కేవలం ఖరీదైన లోహం మాత్రమే కాదు.. అణుశక్తి, వైద్యం, అంతరిక్ష రంగాల్లో చాలా సైలెంట్‌గా విప్లవం సృష్టిస్తున్న శాస్త్రీయ అద్భుతం. బంగారం విలువైనదే కానీ విజ్ఞానానికి విలువ కట్టలేమని ఇది మరోసారి నిరూపిస్తుంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు