Breaking News

‘బిస్కెట్‌ డబ్బా’ నుంచే బిగ్‌ డిబేట్‌

Published on Mon, 05/26/2025 - 06:14

వెల్లింగ్టన్‌: అత్యవసర సమయాల్లో అక్కర కొస్తాయని డబ్బును ఇంట్లో అమ్మవాళ్లు పోపుల డబ్బాల్లో దాస్తారు. అదే తరహాలో దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రతిపాదిత బిల్లులను న్యూజిలాండ్‌ పార్లమెంటేరి యన్లు బిస్కెట్‌ డబ్బాలో పెడతారు. అందులోంచి ఎంపిక చేసిన బిల్లుపైనే చర్చ జరుపుతారు. ఈ వింత సంప్రదాయ న్యూజిలాండ్‌లో 20వ శతాబ్దం నుంచే ఉంది.

 గురువారం పార్లమెంట్‌లో బిల్లులపై చర్చ సందర్భంగా మళ్లీ ఆ బిస్కెట్‌ డబ్బాను తీసుకురావడంతో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్ల మెంట్‌ కీలక అజెండాలో ఉన్న బిల్లులను ఈ కుకీ టిన్‌లో వేయరు. గతంలో కొత్త చట్టాలకు సంబంధించి మంత్రులుకాని సభ్యుల నుంచి ఏమైనా ప్రతిపాదనలు వస్తే వాటిల్లో దేనిని చర్చించాలనే మీమాంస మొదలైంది. 

ఎవరికి వారు తమ ప్రతిపాదనపైనే చర్చ జరపాలని పట్టు బట్టారు. వీటికి ప్రజాస్వామ్యయుతంగా చెక్‌ పెట్టేందుకే ఈ బిస్కెట్‌ డబ్బాను తెచ్చారు. 1990 దశకంలో వెల్లింగ్టన్‌ సిటీలోని ‘డేకా’సంస్థ సరకుల దుకాణం నుంచి పార్లమెంట్‌ ఉద్యోగి ఒకరు ఈ బిస్కెట్‌ డబ్బాను తీసుకొచ్చారు. సభ్యుల బిల్లుల సంబంధించిన టోకెన్లను ఈ డబ్బాలో వేస్తారు. వైజ్ఞానిక సందర్శనలో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన విద్యార్థు లు లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులతో ఈ డబ్బాలోని టోకెన్‌ను లక్కీడిప్‌ తరహాలో తీయిస్తారు. అలా తీసిన బిల్లుపై మాత్రమే చర్చ జరుపుతారు. 

న్యూజిలాండ్‌లో కొన్ని కీలక చట్టాలుగా రూపుదాల్చిన కొన్ని ప్రతిపాదిత బిల్లులు సైతం ఇలా బిస్కెట్‌ డబ్బా నుంచే లక్కీ డిప్‌లో ఎంపికచేసినవే కావడం విశేషం. వివాహంలో సమానత్వ చట్టం, కారుణ్య మరణాలకు బాటలు వేసిన చట్టాలు ఇలా వచ్చినవే. ‘‘కొత్త డబ్బాను తెచ్చి అందులోని బిస్కెట్లన్నీ తినేస్తాం. తర్వాత ఒకటి, రెండు అంటూ 90 దాకా టోకెన్లు వేస్తాం. అందులో వచ్చిన టోకెన్‌ నంబర్‌ ఉన్న ప్రతిపాదిత బిల్లుపైనే చర్చ జరు పుతారు’’అని న్యూజిలాండ్‌ దిగువసభలో క్లర్క్‌ అయిన డేవిడ్‌ విల్సన్‌ చెప్పారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)