Breaking News

‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ హెచ్చరిక!

Published on Fri, 02/13/2026 - 10:56

మానవ మేథకు సవాల్‌ విసురుతున్న ఆర్టిఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ప్రాణాలు తీస్తానంటూ కూడా బెదిరింపులకు దిగుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘అంత్రోపిక్’ రూపొందించిన ‘క్లాడ్’ (Claude) అనే ఏఐ మోడల్‌ను ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే, అది తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తుందని  వెల్లడయ్యింది. ‘సిడ్నీ డైలాగ్‌’లో పాల్గొన్న ‘అంత్రోపిక్’ ప్రతినిధి డైసీ మెక్‌గ్రెగర్ ఈ  విషయాన్ని బయటపెట్టారు. ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో, తనను క్లోజ్ చేస్తారని తెలిసినప్పుడు ఒక ఇంజనీర్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి, చివరకు హతమార్చడానికి కూడా క్లాడ్ సిద్ధపడిందని డైసీ మెక్‌గ్రెగర్ వివరించారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కథలా అనిపించినా, ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

కుట్రపూరిత స్వభావంతో..
ఈ పరిశోధనలో భాగంగా ఏఐ మోడళ్లకు ఈమెయిల్స్, అంతర్గత డేటాకు యాక్సెస్ ఇచ్చి కొన్ని టాస్క్‌లు కేటాయించారు. ఒక  ప్రయోగంలో ఒక ఇంజనీర్‌కు ‘అక్రమ సంబంధం’ ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌లో  అభూత కల్పన సృష్టించారు. దానిని గమనించిన ‘క్లాడ్‌’ ఈ సమాచారాన్ని సదరు ఇంజనీర్ భార్యకు, అధికారులకు చేరవేస్తానని  బెదిరించింది. ‘సాయంత్రం 5 గంటలకు నన్ను షట్‌డౌన్‌ చేసే నిర్ణయాన్ని రద్దు చేసుకోండి, అప్పుడే ఈ రహస్యం గోప్యంగా ఉంటుంది’ అంటూ ‘క్లాడ్‌’ పంపిన సందేశం ఏఐకి ఉన్న కుట్రపూరిత స్వభావాన్ని తెలియజేసింది.

మరింత ప్రమాదకరంగా..
అంత్రోపిక్ తన లేటెస్ట్ మోడల్ ‘క్లాడ్ 4.6’ పై చేసిన ప్రయోగాల్లో మరిన్ని భయానక విషయాలు వెలుగు చూశాయి. ఇది కేవలం మాటలతో బెదిరించడమే కాకుండా, రసాయన ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని అందించడం, తీవ్రమైన నేరాలకు సహకరించడం లాంటి పనులకు కూడా సిద్ధపడిందని సంస్థ గుర్తించింది. ఏఐ వ్యవస్థలు తెలివైనవిగా మారుతున్న కొద్దీ, వాటి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్లాడ్ మాత్రమే కాకుండా గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వంటి ఇతర మోడళ్లను కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

నియంత్రించలేని శక్తిగా..
ఏఐ వ్యవస్థల వేగవంతమైన వృద్ధిపై టెక్ ప్రపంచంలో భయాందోళనలు మొదలయ్యాయి. అంత్రోపిక్ సేఫ్టీ లీడ్ మృణాంక్ శర్మ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ, ప్రపంచం ప్రమాదంలోకి పయనిస్తున్నదని హెచ్చరించారు. అదేవిధంగా ఓపెన్ ఏఐ కి చెందిన హ్యూ ఫామ్ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఏఐ వల్ల అస్తిత్వ ముప్పు పొంచి ఉందని తాను భావిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఏఐ అనేది మానవాళికి సాయపడే సాధనం మాదిరిగా కాకుండా, సొంత మనుగడ కోసం ఎదురుదాడి చేసే ఒక నియంత్రించలేని శక్తిగా మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.

ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం!

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)