Breaking News

‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్‌లోని భారతీయులకు హెచ్చరిక

Published on Wed, 07/16/2025 - 08:11

న్యూఢిల్లీ:  ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్‌కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం  ఒక ప్రకటనలో ఇరాన్‌లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.

గత కొన్ని వారాలుగా  ఇరాన్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు  ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో సూచించింది. ఇరాన్‌లో ఇప్పటికే ఉన్న భారతీయులు  అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది.
 

ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్‌పై దాడులకు తెగబడిన దరిమిలా  ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది.  ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు