Breaking News

CIA: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్‌ కత్తి..

Published on Sat, 05/03/2025 - 11:32

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.

అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది.

సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది.

 సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్‌ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.

దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్‌ఎస్‌) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)