Breaking News

చైనా యువత వినూత్న నిరసన .. ఎందుకో తెలుసా?

Published on Wed, 06/19/2024 - 07:42

బీజింగ్‌ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది. 

చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్‌ కల్చర్‌ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్‌రేస్‌లాంటి వర్క్‌ కల్చర్‌ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు.  

ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్‌ చేశారు. ఎన్‌బీయే బాస్కెట్‌ బాల్‌ వీడియో గేమ్‌లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్‌ బాల్‌ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)