Breaking News

అమెరికాలో ‘చైనా’ క‌ల‌క‌లం.. ఎంత ప‌ని చేసింది!

Published on Fri, 12/20/2024 - 12:59

మన్‌హటన్‌: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్‌ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్‌ జిన్‌పింగ్, లు జియన్‌వాంగ్‌ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్‌ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్‌ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్‌ జిన్‌పింగ్, లు జియాన్‌ వాంగ్‌లు తమ సెల్‌ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్‌ చేశారు.

అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్‌కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్‌స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్‌ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్‌స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్‌ స్టేషన్‌ రామెన్‌ మాల్‌లోని ఓ ఫోర్‌ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.

చ‌ద‌వండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..

ఏమాత్రం సహించం
‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్‌ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ మాథ్యూ ఓల్సెన్‌ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబ‌ర్‌లో న్యూ యార్క్‌ గవర్నర్‌ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్‌ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్‌ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)