Breaking News

చైనా చేతికి ‘పవర్‌ఫుల్‌ బీమ్‌’.. గురి తప్పేదే లే..

Published on Wed, 12/04/2024 - 10:43

బీజింగ్‌: చైనా.. గత కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో తాము  అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్తను ప్రపంచంముందు ఉంచారు. చైనా దీనికి ‘బీమ్ వెపన్’ అనే పేరు పెట్టింది. స్టార్ వార్స్ సినిమా చూడని వారికి ‘బీమ్ వెపన్’ ఎటువంటిదో అర్థం కాదు. అందుకే ఆ వివరాలు మీకోసం..

స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది.  ఈ కాంతిపుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. ఈ అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం ఒక గ్రహాన్నే నాశనం చేయగలదు. ఇదొక లేజర్‌ వెపన్‌. సరిగ్గా ఇలాంటి పవర్‌ఫుల్‌ ఆయుధాన్నే చైనా తయారుచేసింది.

బీమ్ వెపన్ అనేది లేజర్‌తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం. ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతి పుంజం లక్ష్యాన్ని అ‍త్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు. లేజర్‌ కిరణాలను నియంత్రిస్తూ, వాటిని శత్రువు వైపు  ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్‌ ఆయుధాన్ని వినియోగంచేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి. బీమ్‌ ఆయుధం భారీ పరిమాణంలో ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడరన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది. బీమ్‌ వెపన్‌ అధిక ఖచ్చితత్వాన్ని సాధించేందుకు, దానికి మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

బీమ్ తరహా ఆయుధాల అభివృద్ధిలో అనేక సాంకేతిక, ఆచరణాత్మక సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అధిక శక్తి వనరులు అవసరమన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చైనా ఈ తరహా ఆయుధాల తయారీలో పురోగతి సాధిస్తోంది. భవిష్యత్తులో బీమ్ ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది?

#

Tags : 1

Videos

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)