Breaking News

రఫేల్‌ యుద్ధ విమానాలతో ఫొటోలు.. చైనా పౌరుల అరెస్టు

Published on Fri, 07/11/2025 - 07:21

ఏథెన్స్‌: గ్రీస్‌ దేశంలోని తనగ్రాలో రఫేల్‌ యుద్ధ విమానాలను ఫొటోలు తీసినందుకు నలుగురు చైనా జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిసింది. తనగ్రాలో గ్రీస్‌ వైమానిక, సైనిక స్థావరాలు ఉన్నాయి. 

హెలినిక్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీ(హెచ్‌ఏఐ) ఇక్కడే ఉంది. తాజాగా చైనా పౌరులు ఈ ప్రాంతంలో రఫేల్‌ యుద్ధ విమానాలతోపాటు ఇతర రక్షణ సదుపాయాలను కెమెరాల్లో బందిస్తున్నట్లు హెలినిక్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. దూరంగా వెళ్లిపోవాలని ఆ నలుగురిని హెచ్చరించారు. దాంతో వారు కొంతదూరం వెళ్లి మళ్లీ ఫొటోలు తీస్తుండడంతో అనుమానం వచ్చి వెంటనే అదుపులోకి తీసుకొని, స్థానిక లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. రక్షణపరంగా తనగ్రా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ఫొటోల వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. 

చైనా జాతీయుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, వారు గూఢచారులు కావొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రక్షణపరంగా భారత్‌–గ్రీస్‌ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాలు కలిసి తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత వైమానిక దళం ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌లో రఫేల్‌ ఫైటర్‌ జెట్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది. ఈ ఫైటర్‌ జెట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికే చైనా పౌరులు వాటిని ఫొటోలు తీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)