Breaking News

భారత్, చైనాలు మా సన్నిహిత మిత్రులు

Published on Sat, 12/06/2025 - 02:40

బీజింగ్‌: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్‌ భారత్‌ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్‌ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్‌లో పుతిన్‌ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.

ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్‌తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్‌. 2020లో లద్దాఖ్‌లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్‌ను పుతిన్‌ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయడంపై ట్రంప్‌ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్‌ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్‌ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్‌ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్‌లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్‌తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..!  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)