Breaking News

104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి

Published on Mon, 09/09/2024 - 18:23

30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవుతో వరుసగా 104 రోజులు పనిచేసిన తర్వాత అవయవ వైఫల్యంతో బాధపడుతూ మరణించాడు. తరువాత, అతని మరణానికి 20 శాతం యజమాని యజమాని కారణమని కోర్టు తీర్పు చెప్పింది.

ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా, కనీసం ఆఫ్‌ కూడా వినియోగించకుండా 100 రోజులకు పైగా నిరంతరం పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. వృత్యిరీత్యా పెయింటర్‌ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ పని ప్రాజెక్టు కోసం ఒప్పందంపై సంతకం చేశాడు.ఫిబ్రవరి నుంచి మేరకు ప్రతిరోజు పనిచేశాడు. కేవతం ఏప్రిల్‌ 6న ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు.

ఈ క్రమంలో మే 25న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ జూన్‌ 2023లో ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది

కానీ అతడి యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్చందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నాడు.

కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయస్థౠనం ఏకీభవించలేదు.  అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పనిచేయడం అనేది చైనీస్‌ లేబర్‌ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘగించినట్లేనని పేర్కొంది. 

చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు, వారానికి సగటున 44 గంటలు మాత్రమే పనిచేయాలని  తెలిపింది. అనంతరంఅబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), అతడి మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)