Breaking News

3 నెలల వయసులో కిడ్నాపై... 26 సంవత్సరాలకు తల్లిదండ్రులను చేరి..

Published on Mon, 12/16/2024 - 05:59

బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్‌ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు. 

తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్‌ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్‌. 

అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్‌ స్ట్రీమింగ్‌ ఛానల్‌ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)