పెళ్లంటేనే చైనా యువత వెన్నులో వణుకు.. ఎందుకంటే..?

Published on Mon, 07/03/2023 - 11:33

వరుస గృహ హింస కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో చైనాలో యువత పెళ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి హింసాత్మక పెళ్లిళ్లు అవసరమా? అనే ప్రశ్నలు యువతలో తలెత్తుతున్నాయని చైనా మీడియాకి చెందిన ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల షాన్డాంగ్‌ ప్రావిన్స్‌లో భార‍్యను భర్త హింసాత్మకంగా చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది.

షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఓ భర్త తన భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. కారుతో తన భార్యపై పలుమార్లు దాడి చేశాడు. బాధితురాలు బతికే ఉందని తెలుసుకుని.. మరలా కారును ఆమెపై నుంచి పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త చైనా అంతటా వ్యాపించింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కుటుంబ కలహాలతోనే 37 ఏళ్ల భర్త తన 38 ఏళ్ల భార్యను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  

ఈ ఘటనకు ముందు మరో రెండు గృహ హింస కేసులు చైనాలో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనల్లో నిందితులు ప్రదర్శించిన క్రూరత్వం సర్వత్రా ప్రజలను భీతికొల్పే స్థాయిలో ఉంది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్య, మరదలిని కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎన్నో ఏళ్లుగా గృహ హింస అనుభవిస్తున్న మహిళ.. విడాకులను కోరింది. ఈ క్రమంలో దాడి చేశాడు భర్త.

 చెంగ్డు ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులను కోరిన భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఎనిమిది రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. వారి రెండేళ్ల కాపురంలో భర్త తనపై 16 సార్లు దాడి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలు చైనా ప్రజలకు పెళ్లిపై ఎన్నో ప్రశ్నలను మిగిలిస్తున్నాయని చైనా మీడియా ప్రచురించింది. పెళ్లంటేనే యువత భయపడే పరిస్థితి ఎదురయ్యే ఘటనలు జరగుతున్నాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)