Breaking News

హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలును పరీక్షించిన చైనా

Published on Sun, 12/29/2024 - 13:06

బీజింగ్‌:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్‌ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్‌450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్‌29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. 

ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్‌ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్‌ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.

ఈ బుల్లెట్‌ రైలు చైనా రాజధాని బీజింగ్‌ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్‌400 మోడల్‌ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.

ఇక గత బుల్లెట్‌ రైలు మోడల్‌ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్‌ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్‌ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. 
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు