Breaking News

పాక్‌కు చైనా షాక్‌.. కాన్సులర్‌ ఆఫీస్‌ క్లోజ్‌!

Published on Wed, 02/15/2023 - 17:28

చైనా అనూహ్య నిర్ణయంతో పాక్‌కు షాక్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కాన్సులర్‌ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్‌లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం.

ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్‌ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా.

వాస్తవానికి  తాలిబన్‌ గ్రూప్‌తో పాక్‌ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా  బీజింగ్‌ బెల్ట్‌​ అండ్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(బీఆర్‌ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్‌ ఎకనామిక్‌ కారిడర్‌(సీపెక్‌)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా.

గత ఏప్రిల్‌లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్‌తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే.  కాగా, సీపెక్‌ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్‌లోని రోడ్లు, రైల్వేలు, పైప్‌లైన్‌లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్క్‌. ఈ బీఆర్‌ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్‌ భావిస్తోంది. 

(చదవండి: ఇదే భారత్‌ ఇమేజ్‌..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)