Breaking News

‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్‌ ఆదేశాలు

Published on Tue, 04/15/2025 - 15:20

బీజింగ్‌: అమెరికా-చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ (China–United States trade war) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు (Boeing) చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.  బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది.  

ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.

 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)