Breaking News

తైవాన్‌ జలసంధిలోకి అమెరికా, కెనడా యుద్ధనౌకలు

Published on Tue, 10/22/2024 - 05:48

తైపీ: తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలకు తావిచ్చే మరో పరిణామమిది. ఆదివారం అమెరికా, కెనడా యుద్ధ నౌకలు చైనా, తైవాన్‌లను విడదీసే తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశించాయి. అమెరికా యుద్ద నౌక యూఎస్‌ఎస్‌ హిగ్గిన్స్, కెనడా యుద్ధ నౌక హెచ్‌ఎంసీఎస్‌ వాంకూవర్‌ ఆదివారం తైవాన్‌ జలసంధి గుండా ప్రయాణించాయని, తైవాన్‌ జలసంధి గుండా వెళ్లేందుకు అన్ని దేశాల నౌకలకు స్వేచ్ఛ ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని సోమవారం అమెరికా నేవీకి చెందిన ఏడో ఫ్లీట్‌ తెలిపింది. తైవాన్‌ భూభాగం తమదేనంటూ వారం క్రితం చైనా భారీ యుద్ధ విన్యాసాలతో ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో దిగ్బంధించడం తెలిసిందే. 

గత నెలలో జర్మనీకి చెందిన రెండు యుద్ధ నౌకలు తైవాన్‌ జలసంధిలో ప్రయాణించాయి. కాగా, తాజాగా అమెరికా, కెనడాల చర్యను చైనా ఖండించింది. తైవాన్‌ అంశం స్వేచ్ఛా నౌకాయానానికి సంబంధించింది కాదు, తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు సంబంధించిన వ్యవహారమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా, కెనడా యుద్ధ నౌకలు తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశించడం ఈ ప్రాంత శాంతి, సుస్థిరతలకు భంగకరమని చైనా మిలటరీ వ్యాఖ్యానించింది. అవి జలసంధిలో ఉన్నంత సేపు వాటిని పరిశీలించేందుకు తమ వైమానిక, నౌకా బలగాలను అక్కడికి తరలించామని వివరించింది. 

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు