Breaking News

China: ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ‘‘మెరుపు తీగే’.. గంటకు ఎంత వేగమంటే..

Published on Wed, 10/22/2025 - 15:34

న్యూఢిల్లీ: బుల్లెట్‌ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్‌ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్‌లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.

బుల్లెట్ రైలు సీఆర్‌ 450ను ప్రస్తుతం షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్‌ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్‌ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్‌ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్‌ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.

సీఆర్‌ 450ను స్మార్ట్ డిజైన్‌తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు. నూతన మోడల్‌లో ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం మేరకు తగ్గించారు. దీంతో వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది. ట్రయల్స్ సమయంలో, రెండు సీఆర్‌ 450 రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీశాయి. ప్రయాణ వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల  డిజైన్ ప్రేరణతో  ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు. 

 

ఇది కూడా చదవండి: మెహుల్‌ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు
 

Videos

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)