మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు!
Published on Sat, 12/17/2022 - 16:12
బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అత్యంత కఠినతరమైన ఆంక్షలు అమలు చేసింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనలను డిసెంబర్ 7న ఎత్తివేసింది.
ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో తొలి కరోనా మరణాలు నమోదైనట్లు సింగపూర్ డైలీ వెల్లడించింది. చైనా ప్రభుత్వ మీడియాలో పనిచేసిన మాజీ జర్నలిస్టులు ఇద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు తెలిపింది. డిసెంబర్ 8న ఒకరు, డిసెంబర్ 15న మరొకరు వైరస్‌కు బలైనట్లు చెప్పింది.
అయితే చైనా ఆరోగ్య శాఖ మాత్రం ఈ మరణాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆంక్షలు సడలించిన తర్వాత ఎవరైనా వైరస్ కారణంగా చనిపోయారా? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశాక కరోనా కేసులను ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది.
చదవండి: రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
Tags : 1