ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి

Published on Tue, 07/18/2023 - 13:16

ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాది ప్రాంతం భారీ వర్షాలకు, వరదలకు వణుకుతుండగా, చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్‌ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్‌ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. 

మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్‌కింగ్‌ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇ‍ళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో  చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
ఇది కూడా చదవండి: ‘సూపర్‌’ డ్యామ్‌ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)