Breaking News

అస్తమానం టీవీ చూస్తున్న పిల్లాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?

Published on Sun, 11/27/2022 - 13:25

బీజింగ్‌: 8 ఏళ్ల కుమారుడు అస్తమానం టీవీ చూస్తున్నాడని కఠిన శిక్ష విధించారు చైనాకు చెందిన తల్లిదండ్రులు. అయితే వీరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అని పలువురు మండిపడ్డారు.

సెంట్రల్ చైనా హునాన్ ప్రావిన్స్‌లో నివసించే ఈ జంట పని మీద బయటకు వెళ్తూ హోం వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత పడుకోమని తమ కుమారుడికి చెప్పింది. అయితే వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ  బాలుడు టీవీ చూస్తున్నాడు. అంతేకాకుండా హోం వర్క్ కూడా పూర్తి చేయలేదు. 

దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఫలితంగా రాత్రంతా టీవీ చూస్తూనే ఉండాలని కుమారుడికి శిక్ష విధించారు. ‍అతడు పడుకోకుండా ఇద్దరూ తరచూ అతడ్ని గమనించారు. అయితే మొదట స్నాక్స్ తింటూ హాయిగా టీవీ చూసిన పిల్లాడికి కాసేపయ్యాక అలసట వచ్చింది. ఫలితంగా తనవల్ల కాదని ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం 5 గంటల వరకు నిద్రపోనివ్వకుండా ‍అతడ్ని టీవీ ముందే కూర్చోబెట్టారు.

ఈ తల్లిదండ్రుల పేరెంటింగ్‌పై చైనాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, పిల్లాడికి ఒకవేళ ఇదే అలవాటై రోజు ఆలస్యంగా పడుకుని, ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తే ఏం చేస్తారని కొందరు ప్రశ్నించారు.

చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగి ప్రభుత్వం కొత్త చట్టాన్నే తీసుకువచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. పిల్లలు నేరాలు చేసినా, తప్పుగా ప్రవర్తించినా వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి.
చదవండి: ఎలాన్‌ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై..

#

Tags : 1

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)