Breaking News

తైవాన్‌  జలసంధిలో భారీగా విన్యాసాలు

Published on Tue, 12/30/2025 - 06:23

బీజింగ్‌: తైవాన్‌ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్‌ దేశం చైనా తైవాన్‌ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్‌కు మద్దతుగా జపాన్‌ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్‌కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 

ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆరీ్మ(పీఎల్‌ఏ) ఈస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్‌ రేంజ్‌ క్షిపణులతో తైవాన్‌ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. 

చైనా చర్యలపై తైవాన్‌ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ విన్యాసాలను చేపట్టామని తైవాన్‌ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్‌ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్‌ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్‌ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. 

ఓ వైపు జపాన్‌.. మరో వైపు అమెరికా 
నవంబర్‌ 7న జపాన్‌ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్‌లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్‌ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్‌ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్‌ సర్వైలెన్స్‌ రాడార్‌ యూనిట్‌ను మోహరించాలనే జపాన్‌ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్‌కు సమీపంలో జపాన్‌ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్‌కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు.

 ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్‌కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్‌ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్‌ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్‌ దేశం విన్యాసాల పేరుతో తైవాన్‌ను పలుమార్లు దిగ్బంధనం చేసింది.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)