గెలుపంటే ఇదేకదా..డెలివరీ బాయ్‌టూ చైనా సాహిత్య పురస్కారం

Published on Tue, 07/21/2026 - 04:30

బీజింగ్: పొట్టకూటికోసం వీధుల వెంట పరుగులు తీస్తూ డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏకం ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్.. చైనాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. 56 ఏళ్ల వాంగ్ జిబింగ్ రాసిన "మ్యాన్ ఇన్ ఎ హర్రీ" అనే కవితా సంకలనానికి  ఆ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘లుక్సున్" పురస్కారం లభించింది

కష్టాల నుంచి కవిత్వం వైపు
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ జిబింగ్ జీవితం అంతా ఒడిదుడుకులతోనే సాగింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నతనంలోనే చదువుకు దూరమైన వాంగ్.. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యర్థాలు సేకరించే వ్యక్తిగా, రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా మారారు. చివరకు 2019లో కున్షాన్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా స్థిరపడ్డారు.

రోజుకు 12 నుంచి 14 గంటల పాటు సైకిళ్లు, బైకులపై తిరుగుతూ డెలివరీలు ఇచ్చే క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలే ఆయనలోని కవిని మేల్కొలిపేలా చేశాయి.

ఒక్క ఘటన జీవితాన్నే మార్చింది
2019లో ఒక కస్టమర్ తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల వాంగ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్డర్ లేట్ అవ్వడంతో కస్టమర్ ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, కంపెనీ నుండి పెనాల్టీ పడింది. ఆ రాత్రి గుండెల్లోని ఆవేదనను కవిత్వంగా మారుస్తూ ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ (తొందరపాటులో ఉన్న మనిషి) అనే కవిత 2022లో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'వైబో' (Weibo) లో విపరీతంగా వైరల్ అయింది. కోట్లాది మంది శ్రమజీవుల మనసులను తాకిన ఆ ఒక్క కవితతో ఆయన రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అత్యున్నత పురస్కారం ‘లుక్సున్ లిటరరీ ప్రైజ్’
వాంగ్ జిబింగ్ తాజాగా రాసిన ‘లో ఫ్లైట్’ (Low Flight) అనే కవితల సంపుటికి చైనాలోనే అత్యున్నత గౌరవప్రదమైన "లు క్సున్ లిటరరీ ప్రైజ్" లభించింది. చైనా ఆధునిక సాహిత్య పితామహుడిగా పిలవబడే 'లు క్సున్' జ్ఞాపకార్థం ఇచ్చే ఈ అవార్డును, కవిత్వ విభాగంలో వాంగ్‌కు అందజేశారు.

ఈ పుస్తకం కోసం ఆయన కేవలం తన బాధలనే కాకుండా, గిగ్ ఎకానమీ (తాత్కాలిక ఉపాధి రంగం) లో పనిచేసే దాదాపు 200 మంది తోటి డెలివరీ రైడర్ల జీవితాలను, వారి సవాళ్లను ఇంటర్వ్యూ చేసి కవితలుగా మలిచారు. ఇప్పటివరకు ఆయన దాదాపు 6,000 పైగా కవితలు రాయడం విశేషం.

నగదు పురస్కారం.. అంతకుమించి రాయల్టీ!
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వాంగ్‌కు చైనీస్ రైటర్స్ అసోసియేషన్ భారీ నగదు బహుమతిని కూడా అందజేసింది. గత అవార్డుల లెక్కల ప్రకారం ఈ పురస్కార గ్రహీతలకు సుమారు 1,00,000 చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 11.5 లక్షలకు పైగా) నగదు లభిస్తుంది. దీనితో పాటు, అవార్డు రావడంతో ఆయన పుస్తకాల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. దీని ద్వారా పబ్లిషర్స్ నుండి ఆయనకు లక్షల్లో రాయల్టీ ఆదాయం కూడా సమకూరుతోంది.

డెలివరీలు ఆపేది లేదు

సాధారణంగా ఇంత పెద్ద అవార్డు, డబ్బు వస్తే ఎవరైనా ఆ కష్టమైన ఉద్యోగాన్ని వదిలేస్తారు. కానీ వాంగ్ జిబింగ్ మాత్రం తన వినమ్రతను చాటుకున్నారు."ఈ అవార్డు నా జీవితాన్ని కానీ, నన్ను కానీ మార్చలేదు. నాకు 60 ఏళ్లు వచ్చే వరకు నేను డెలివరీ బాయ్‌గానే పనిచేస్తాను. ఈ పనే నన్ను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది, సమాజంలోని సామాన్య ప్రజల కష్టాలకు దగ్గరగా ఉంచుతుంది. శ్రమజీవుల గొంతుకగా నా కలాన్ని సాగిస్తూనే ఉంటాను" అని వాంగ్ స్పష్టం చేశారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)