Breaking News

హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించిన చైనా 

Published on Mon, 04/21/2025 - 05:54

బీజింగ్‌:  రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. 

ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్‌–న్యూక్లియర్‌ హైడ్రోజన్‌ బాంబ్‌ను చైనా పరీక్షించిందని ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్‌’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. 

శుద్ధ ఇంధన సాంకేతికతతో.. 
చైనా ప్రభుత్వ షిప్‌బిల్డింగ్‌ కార్పొరేషన్‌లోని ‘705 రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్‌ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్‌ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్‌ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్‌ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. 

దాన్నుంచి హైడ్రోజన్‌ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్‌(టీఎన్‌టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్‌ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. 

నిశ్శబ్దంగా తయారీ 
ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్‌ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్‌ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్‌లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)