Breaking News

రక్షణరంగ బడ్జెట్‌ను మరింత పెంచిన చైనా

Published on Tue, 03/05/2024 - 11:39

చైనా తన రక్షణరంగ బడ్జెట్‌ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్‌ను  7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్‌ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.  

అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా  భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్‌ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్‌ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)