Breaking News

చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్‌, జపాన్‌లకు ముప్పు

Published on Wed, 09/25/2024 - 11:30

బీజింగ్‌: పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు చైనా  వెల్లడించింది.  ఇది అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పుగా పరిణమించనున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్  ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జారవిడిచారు.

దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు, సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. 1989 తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది. చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష 1980 మేలో జరిగింది. అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది.

చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్‌తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 ఐసీబీఎంలున్నాయి. 2030 నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. చైనా సైన్యం వందలాది రహస్య క్షిపణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..!హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..!

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు