Breaking News

చైనా కవ్వింపు చర్య.. భారత్‌ భూభాగంలో వంతెన నిర్మాణం

Published on Wed, 07/31/2024 - 08:28

భారత సరిహద్దులోని ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ  ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి  సంబంధించిన సాటిలైట్‌ అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై  సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్‌ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్‌ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్‌  సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్‌కి  ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 

అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్‌ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్‌ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్‌ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్‌ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)