Breaking News

Pakistan: ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అరెస్ట్‌

Published on Sun, 10/06/2024 - 08:07

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో అత్యంత సమస్యాత్మక ప్రావిన్స్‌గా  మారిన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గుండాపుర్‌ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుండాపుర్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్)కి చెందిన నేత. ఆయన పార్టీ నిరసనల్లో పాల్గొంటున్న సందర్భంలో అరెస్టయ్యారు. అయితే ఆయన అరెస్ట్‌ను పాక్‌ ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.

పాక్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటూనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖాన్ పార్టీ  చేపట్టిన నిరసనకారులకు గుండాపుర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి కేపీ హౌస్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పీటీఐ తెలిపింది.

‘పాక్‌ రేంజర్లు కేపీ హౌస్‌లోకి బలవంతంగా ప్రవేశించి ముఖ్యమంత్రి గుండాపుర్‌ను అరెస్టు చేసే ప్రయత్నంలో దూకుడు ప్రదర్శించారు. అధికార దుర్వినియోగం చేశారు. ఇది పాకిస్తాన్‌లో అమలవుతున్న చట్టవిరుద్ధమైన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది’ అంటూ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేసింది. కాగా అక్రమ ఆయుధాలు, మద్యం రికవరీకి సంబంధించి ముఖ్యమంత్రిని కోర్టులో హాజరుపరచడానికి  ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: జావెలిన్‌ దిగిందా లేదా!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)