Breaking News

Chicago: 100 కార్లతో రేసింగ్.. తుపాకులతో విధ్వంసం..

Published on Mon, 10/24/2022 - 10:13

వాషింగ్టన్‌: అమెరికా చికాగో ఇంటర్‌సెక్షన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది కలిసి 100 కార్లతో డ్రాగ్‌ రేసింగ్ నిర్వహించి విధ్వంసం సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరిపి రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

చికాగో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే రేమండ్‌ లోపేజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డ్రాగ్ రేసింగ్ కారవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇవి వీధుల్లో తమషా కోసం నిర్వహించే గేమ్స్ కాదని మండిపడ్డారు.

ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో చికాగో ఇంటర్‌సెక్షన్‌ను కొన్ని గ్యాంగ్‌లు కలిసి 100 కార్లతో తమ నియంత్రణలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నడిరోడ్డుపై రేసింగ్‌లు నిర్వహించి స్టంట్‌లు చేశారని పేర్కొన్నారు. మొత్తం 13 సార్లు కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. 

తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఐదుగురు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారని, వెంటనే వారిని ఆ‍స్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్..

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)