Breaking News

కాల్పుల విరమణకు సై 

Published on Fri, 01/17/2025 - 20:47

జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్‌–ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్‌ కేబినెట్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం  నుంచి అమల్లోకి వస్తుంది. 

15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్‌ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి. 

గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్‌ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)