Breaking News

అరబ్‌ దేశాల్లో క్యాసినో.. లగ్జరీ కా సీన్ ...!

Published on Sat, 02/21/2026 - 22:40

అత్యంత కఠినమైన సంప్రదాయాలు, ఆచారాలకు పేరొందిన అరబ్‌ దేశాలు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉదారవాద విధానాల వైపు మారడం ప్రారంభమై..గత కొంత కాలంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ట్రెండ్‌లో ముందున్న దుబాయ్‌... ఇప్పటికే ప్రపంచ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ నేపధ్యంలో దుబాయ్‌కి సమీపంలోనే ఉన్న రస్‌ ఆల్‌ ఖైమా లో ఏర్పాటవుతున్న క్యాసినో ఆ ప్రాంత పర్యాటక సంప్రదాయాలను పునర్నిర్వచించనుంది.
 

క్యాసినో అంటే ప్రధానంగా జూదకేంద్రాలు అనేది తెలిసిందే. ప్రపంచంలో పలు దేశాల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నప్పటికీ చాలా దేశాల్లో అనుమతులు లేవు. మన దేశంలో సైతం కేవలం గోవాలో అది కూడా సముద్రజలాలపై తప్ప మరెక్కడా వీటి నిర్వహణకు అవకాశం లేదు. ఈ నేపధ్యంలో అత్యంత కఠినమైన సంప్రదాయాలకు పేరొందిన అరబ్‌ దేశాల్లో తొలి క్యాసినో  పరిచయం కానుండడం ప్రపంచ పర్యాటకంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 5.1 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ రిసార్ట్‌ అయిన విన్‌ అల్‌ మార్జన్‌ ఐలాండ్‌ ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రస్‌ అల్‌ ఖైమా లో ఏర్పాటవుతోంది. తద్వారా ప్రపంచ పర్యాటక రంగంలో ఒక పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది.
 

దుబాయ్‌ నుంచి 50 మైళ్ల లోపు దూరంలో ఉన్న 60 హెక్టార్ల మానవ నిర్మిత ద్వీపంలో  ఈ రిసార్ట్‌ నిర్మితమైంది. ఇది అరేబియన్‌ గల్ఫ్‌ కంటే 70 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. పూర్తి విలాసవంతంగా రూపొందిన ఈ రిసార్ట్‌లో మొత్తం 1,530 గదులు  సూట్‌లు, పై అంతస్తులలో బోటిక్‌ హోటల్, ఇందులోని ‘ఎన్ క్లేవ్‌‘లో 313 అల్ట్రా–లగ్జరీ బస సౌకర్యం ఉంటుంది. మొత్తం 20,900 చదరపు మీటర్ల క్యాసినో 22వ అంతస్తులో రెండవ గేమింగ్‌ ప్లేస్, వాటర్‌ గేమ్స్‌ కోసం డీప్‌–వాటర్‌ మెరీనాలు ఉంటాయి. విన్‌ అల్‌ మార్జన్‌ ద్వీపంలో 22 రెస్టారెంట్లు, లాంజ్‌లు కూడా ఉంటాయి.

వీటిలో చెఫ్‌ అలైన్‌ డుకాస్‌ రూపొందించిన ఫ్రెంచ్‌–అమెరికన్‌ స్టీక్‌హౌస్‌  ప్రఖ్యాత లాస్‌ వెగాస్‌ సప్పర్‌ క్లబ్‌ అయిన డెలిలా లు ఉన్నాయి.  ఫైవ్‌–స్టార్‌ స్పా, లగ్జరీ రిటైల్‌ ప్రొమెనేడ్, థియేటర్, నైట్‌క్లబ్‌  7,700 చదరపు మీటర్ల ఈవెంట్స్‌ సెంటర్‌ ఉన్నాయి.షెడ్యూల్‌ ప్రకారం దీని నిర్మాణం చకచకా పురోగమిస్తోంది,గత 2025 చివరి నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తి కాగా, మరో ఏడాది అంటే 2027లో ఇది ప్రారంభానికి నోచుకుంటుందని అంచనా. ప్రారంభం తర్వాత  ఈ రిసార్ట్‌ రస్‌ అల్‌ ఖైమా ప్రొఫైల్‌ను పెంచుతుందని, సంపన్నులైన పర్యాటకులను, సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

అలాగే యుఎఇ ఆర్థిక  వృద్ధి బాటలో వైవిధ్యాన్ని సృష్టించడానికి, ప్రపంచ క్యాసినో గమ్యస్థానాలతో పోటీ పడటానికి ఈ ఎడారి ‘ఆటల వేదిక’ సిద్ధమవుతోంది.  ఈ విన్‌ అల్‌ మార్జన్‌ ద్వీపం పర్యాటకం,  వినోదం పట్ల అరబ్‌ ప్రాంతపు సంప్రదాయ విధానాన్ని పునర్నిర్వచించడం  గల్ఫ్‌లో  ఆతిథ్య పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా పర్యాటక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)