Breaking News

జర్నలిస్ట్‌ను బెదిరించిన ఖలిస్తానీ మద్దతుదారులు 

Published on Mon, 06/09/2025 - 06:34

వాంకోవర్‌: కెనడా గడ్డపై తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు తాజాగా కెనడియన్‌ జర్నలిస్ట్‌ను బెదిరించారు. ర్యాలీని తన కెమెరాలో రికార్డ్‌ చేస్తున్నందుకు జర్నలిస్ట్‌ మోకా బెజిర్‌గన్‌ను కొట్టినంత పనిచేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలను మోకా తర్వాత వెల్లడించారు. ఉద్యమకారులంతా దుండగుల్లా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని మోకా చెప్పారు.

 ‘‘ ఈ ఘటన జరిగిన రెండు గంటలవుతున్నా నా శరీరం ఇంకా వణికిపోతోంది. ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. నన్ను చుట్టుముట్టి బెదిరించారు. నా ఫోన్‌ బలవంతంగా లాక్కున్నారు. గతంలో ఖలిస్తానీ ఉద్యమాలపై సొంతంగా రిపోర్టింగ్‌ చేసినందుకు నాపై కక్షగట్టారు. ఖలిస్తానీవేర్పాటువాదులపై నేను తటస్థ వైఖరిని ప్రదర్శించడం వాళ్లకు నచ్చలేదనుకుంటా. అందుకే నన్ను కొట్టినంత పనిచేశారు. కెనడా, బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్‌లలో ఖలిస్తానీయుల వైఖరిని నా రిపోర్టింగ్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేశా.

 అందుకే గతంలో వీళ్లు నన్ను ఆన్‌లైన్‌లో ఇష్టమొచ్చిన పదజాలంతో తిట్టారు. ఆదివారం వాంకోవర్‌లో వాళ్ల ర్యాలీని నేను కెమెరాలో రికార్డ్‌చేస్తుంటే అడ్డుకున్నారు. టచ్‌ చేస్తే ఊరుకునేది లేదని బెదిరించారు. నా పనికి అడ్డురావొద్దని వారించినా వాళ్లు వినిపించుకోలేదు. పదేపదే నా వెనకాల పడ్డారు. ముఖ్యంలో వారిలో ఒకడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకే అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశా. గతంలోనూ అతనిపై ఫిర్యాదుచేశా’’ అని జర్నలిస్ట్‌ మోకా తర్వాత ఒక వీడియోను విడుదలచేశారు. కెనడాలో ఖలిస్తానీవేర్పాటువాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని అక్కడి అధికార యంత్రాంగానికి భారత ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదుచేసినా కెనడా సర్కార్‌లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఖలిస్తానీ సానుభూతిపరులకు కెనడా స్వర్గధామంగా తయారైంది.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)