Breaking News

పాలస్తీనాను గుర్తిస్తాం: కెనడా

Published on Fri, 08/01/2025 - 01:57

ఒట్టావా: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్, యూకేల బాటలో పయనించాలని కెనడా నిర్ణయించుకుంది. గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనుకుంటున్న కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ బుధవారం ప్రకటించారు. శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్‌– పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు. 

అందుకే సెప్టెంబర్‌లో జరిగే ఐరాస జనరల్‌ అసెంబ్లీ 80వ సెషన్‌లో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు. అయితే, సంస్కరణలతో, 2026లో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండరాదని, ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)