Breaking News

ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..

Published on Thu, 03/13/2025 - 18:09

వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చగా మారింది. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఎవరూ సురక్షితంగా లేరంటూ జీ7 దేశాలను కెనడా హెచ్చరించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానియో జోలీ.. అమెరికాతో తీవ్రమవుతున్న వాణిజ్య పోరాటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య చర్యలతో ఎదురయ్యే పరిణామాలపై మిగిలిన దేశాలను ఆమె హెచ్చరించారు.

అత్యంత మిత్రదేశమైన మాతోనే అమెరికా ఇలా ఉంటే.. ఇక ఇతర దేశాలు సురక్షితంగా ఉండలేవంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాబోయే విపత్తును ముందుగా అంచనా వేసి, మిత్రదేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక ట్రంప్‌ తరచూ కెనడా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నవ్యాఖ్యలపై కూడా జోలీ స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తమ దేశం వెనుకంజ వేయదంటూ తేల్చి చెప్పారు. యుద్ధ విన్యాసాలు, ఆయుధ తయారీ వంటి చర్యలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కీలకమైనవిగా ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, ఆర్థిక కోణంలో మాత్రమే తమ అధ్యక్షుడు కెనడాను 51వ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారంటూ అమెరికా మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చారు. ఒక వేళ కెనడా 51 రాష్ట్రం అయితే అప్పుడు సరిహద్దుల గురించి, ఫెంటెనిల్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ట్రంప్‌ భావన’’ అని రూబియో వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్‌ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్‌వార్‌కు బీజం వేశారు. అమెరికా-కెనడా మధ్య సంబంధాలు కూడా ఎన్నడూ లేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కాగా, ట్రంప్‌.. టారిఫ్‌ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్‌ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యథావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.

 

 

 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)