Breaking News

ట్రూడో తాయిలాలు

Published on Sat, 11/23/2024 - 06:29

టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్‌ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్‌ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్‌ కెనడియన్స్‌ రిబేట్‌’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది. 

ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్‌ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్‌ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్, రెస్టారెంట్‌ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు. 

ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్‌ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్‌ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్‌ కార్బన్‌ ట్యాక్స్‌ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు. 

తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్‌ పన్ను, జీఎస్‌టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్‌ సింగ్‌ అన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)