Breaking News

కెనడాలో డ్రగ్స్‌ సూపర్‌ల్యాబ్‌ గుట్టురట్టు

Published on Sat, 11/02/2024 - 06:08

వాంకోవర్‌:  కెనడాలో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 485 మిలియన్‌ డాలర్ల (రూ.4,076 కోట్లు) కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాలలో డ్రగ్స్‌ తయారు చేసి, విక్రయిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త గగన్‌ప్రీత్‌ రంధవాను అరెస్టు చేశారు. కెనడాలో బ్రిటిష్‌ కొలంబియాలోని కామ్లూప్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఫాల్క్ ల్యాండ్‌ అనే గ్రామీణ ప్రాంతంలో ఈ సూపర్‌ ల్యాబ్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఫెంటానైల్, మెథ్, కొకైన్, కన్నబీస్‌ తదితర డ్రగ్స్‌ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. 

సూపర్‌ ల్యాబ్‌ గురించి సమాచారం అందుకున్న రాయల్‌ కెనడియన్‌ మౌంట్‌ పోలీసులు దాడి చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అత్యాధునికంగా ఉన్న ల్యాబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారవుతుండడం చూసి అవాక్కయ్యారు. ఈ దాడిలో 500 కిలోలకుపైగా డ్రగ్స్‌ లభించాయి. అంతేకాదు కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు సైతం లభ్యమయ్యాయి. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్‌ నిర్వహణలో, డ్రగ్స్‌ దందాలో గగన్‌ప్రీత్‌ రంధవా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)